
షేర్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఏబీవీపీ ధర్నా
కుత్బుల్లపూర్ నియోజకవర్గంలోని పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం, అయ్యప్ప మాల ధరించిన 6వ తరగతి విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించలేదు. గత మూడు రోజులుగా విద్యార్థి పాఠశాల ముందు ఇబ్బందులు పడుతున్నాడు. గురువారం, ఎబివిపి విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ఆందోళన చేపట్టాయి. మూడు గంటల తర్వాత యాజమాన్యం స్పందించి, విద్యార్థిని పాఠశాలలోకి అనుమతిస్తామని తెలిపింది.


































