
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీసులు శ్రమదానం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పోలీసులకు వ్యాయామంలో భాగంగా ఈ ఖాళీ ప్రదేశంలో టెన్నిస్, వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్థానికులు పోలీసుల ఈ కార్యక్రమాన్ని అభినందించారు.



































