శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒమన్ ఎయిర్‌వేస్‌లో నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన తూ.గో. జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. మహిళలను శంషాబాద్ ఔట్‌పోస్టుకు అప్పగించారు. తమను ఏజెంట్ మోసం చేశాడని మహిళలు వాపోయారు.