బయో-టెర్రర్ కుట్ర.. డాక్టర్‌తో సహా ముగ్గురిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్!

1చూసినవారు
బయో-టెర్రర్ కుట్ర.. డాక్టర్‌తో సహా ముగ్గురిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్!
తెలంగాణలోని హైదరాబాద్‌లో వెలుగు చూసిన బయో-టెర్రర్ కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా మెడికల్ గ్రాడ్యుయేట్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, తన ఇంటిని రహస్య ప్రయోగశాలగా మార్చి అత్యంత ప్రమాదకరమైన 'రిసిన్' బయో-టాక్సిన్‌ను తయారు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆముదం గింజల నుంచి తీసే ఈ విషాన్ని రద్దీ ప్రదేశాల్లో ప్రయోగించి భారీ ప్రాణనష్టం కలిగించాలని ISIS హ్యాండ్లర్ల ఆదేశాలతో నిందితులు ప్లాన్ చేశారు. నవంబర్ 2025లో గుజరాత్‌లో ఆయుధాలు, ఆముదం నూనెతో పట్టుబడటంతో ఈ కుట్ర బయటపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్, మొహమ్మద్ సుహెల్ కూడా ఈ కుట్రలో పాల్గొన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరిపై UAPA చట్టం కింద కేసులు నమోదు చేసి, అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్ సమర్పించారు.

సంబంధిత పోస్ట్