శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీలో రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందాడని నర్మద అనే ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి తనను పిలుస్తున్నాడని ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలిసింది. నిజామాబాద్ కు చెందిన సిద్ధార్థ్ తో కొంతకాలంగా ప్రేమలో ఉండగా ఇటీవల అతను రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుండి నర్మద డిప్రెషన్లోకి వెళ్లి ప్రియుడు లేని లోకంలో నేను ఉండలేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కలలోకి వచ్చి తనను పిలుస్తున్నాడని తన సోదరికి చెబుతూ కన్నీళ్లు పెట్టుకునేది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ప్రియుడి మరణం తట్టుకోలేకనే తన కూతురు ఆత్మహత్య. చేసుకుందని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.