శంషాబాద్ వద్ద కారులో చెలరేగిన మంటలు

4చూసినవారు
శంషాబాద్ వద్ద కారులో చెలరేగిన మంటలు
హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ, డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ చూస్తుండగానే కారు క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనతో తోటి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు, రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజన్ వేడెక్కడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్