రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందడంతో ప్రియురాలు ఆత్మహత్య

1చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందడంతో ప్రియురాలు ఆత్మహత్య
శంషాబాద్‌లోని సిద్ధేశ్వర్ కాలనీలో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన బూర నర్మద, తన అక్క ఇంట్లో బెడ్రూమ్‌లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో లభించిన లేఖలో, సిద్ధార్థ్ బెజాని గౌడ్ అనే యువకుడిని ప్రేమించానని, 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు నర్మద పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్