రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

1531చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాళ్లగూడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో స్క్రాప్ దుకాణం ఎదురుగా సోమవారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలోరాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శంషాబాద్ రాయల్ విల్లాస్కు చెందిన కర్ల చంద్రశేఖర్ చౌదరి (30) అనే ప్రైవేట్ ఉద్యోగి ప్రమాదానికి గురై మృతి చెందాడు. వాహనం అదుపుతప్పి జారిపడటంతో ఆయనకు ముక్కుకు తీవ్ర గాయమై రక్తస్రావం కాగా నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆతరవాత ఆయన మరణించారు. మృతుడి భార్య ఫిర్యాదులో, వాహనం జారిపడటం వల్లే ప్రమాదం జరిగిందా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా, లేక మరేదైనా కారణమా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్