హైదరాబాద్‌కు చేరుకున్న మృత్యుంజయుడు

5చూసినవారు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ సోహెబ్ చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు. నటరాజ్ నగర్‌లోని తన ఇంటికి చేరుకున్న అతన్ని బంధువులు, మిత్రులు, స్థానికులు కలిసి పరామర్శించారు. ఈ ప్రమాదంలో 45 మంది మరణించిన విషయం తెలిసిందే. తనను సురక్షితంగా భారత్‌కు తిరిగి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సోహెబ్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్