బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరియం కాలనీకి చెందిన ఫహద్ బల్కషర్ (28) అనే యువకుడు అర్ధరాత్రి జరిగిన హత్యతో కలకలం రేగింది. జిమ్‌లో పరిచయమైన సలాం బౌమ్, సయీద్ బౌమ్‌లతో ఫహద్‌కు గత కొంతకాలంగా విభేదాలున్నాయి. సోమవారం తెల్లవారుజామున మాట్లాడుకుందామని పిలిచి, వారిద్దరూ ఫహద్‌పై కిరాతకంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఫహద్‌ను ఒవైసీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ACP ప్రదీప్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.