రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో అడ్మిన్ మేనేజర్ గా పనిచేస్తున్న బాలాజీ, భవనం పై అంతస్తులో ప్రమాదంలో చిక్కుకున్న పావురాన్ని కాపాడే ప్రయత్నంలో రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ నెల 1వ తేదీన జరిగిన ఈ ఘటనలో, చికిత్స పొందుతూ బాలాజీ బుధవారం ఉదయం మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.