రంగారెడ్డి: దొంగ అనుమానాస్పదంగా మృతి

12చూసినవారు
రంగారెడ్డి: దొంగ అనుమానాస్పదంగా మృతి
మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి వచ్చిన దొంగ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ నెల 24న అర్ధరాత్రి పల్లె చెరువు ప్రాంతంలోని స్వస్తిక్ శివ డెకరేటర్స్ గోడౌన్ లోకి చొరబడిన దొంగను కార్మికులు పట్టుకున్నారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో కార్మికులు అతన్ని కొట్టి గోడౌన్ లో బంధించారు. కార్మికుల దాడిలో దొంగ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన నలుగురు కార్మికులను రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్