ఔటర్ రింగ్ రోడ్డుపై రేంజ్ రోవర్ కారు ప్రమాదం

2చూసినవారు
ఔటర్ రింగ్ రోడ్డుపై రేంజ్ రోవర్ కారు ప్రమాదం
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం రాత్రి 10:40 గంటలకు ఓ రేంజ్ రోవర్ కారు స్వీయ ప్రమాదానికి గురైంది. తొండుపల్లి ఎగ్జిట్-16 వద్ద జరిగిన ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. డ్రైవర్ పరారయ్యాడు. స్వల్పంగా గాయపడిన అతడు తుక్కుగూడలోని ఆస్పత్రికి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి సోదరుడు వంశీకృష్ణారెడ్డి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. కృష్ణ చైతన్య రెడ్డి కారు నడిపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు, విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్