వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్సాన్‌పల్లి గ్రామ శివార్లలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మొహమ్మద్ అయాజ్‌కు కుడి కాలు, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తాండూర్ నుండి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వికారాబాద్ వైపు నుంచి అతివేగంగా వచ్చి అదుపుతప్పి కారు ఢీకొట్టింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.