హైదరాబాద్‌లోని జియాగూడలో ఉద్రిక్తత నెలకొంది. ఈనెల 2న జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేసిన స్లాటర్ హౌస్‌కు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్వయంగా వెళ్లి సీళ్లను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉద్రిక్తత పెరిగింది.