నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికోవర్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 35 ఏళ్ల గుంటి సాగర్ అనే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ, బాధితుడి బంధువులు ఆసుపత్రి ముందు భారీ ఆందోళనకు దిగారు. డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చిన సాగర్‌ను వైద్యులు సరైన పద్ధతిలో పట్టించుకోలేదని, దీనివల్లే మరణం సంభవించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటి నుండి వైద్యులు సరైన స్పందన చూపలేదని బంధువులు తెలిపారు.