ఆల్
ఇండియా అంబేద్కర్ యువజన సంఘం (AIAYS) 50వ స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి బుద్ధ వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘం 50 ఏళ్ల ప్రస్థానం, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు విభాగాలుగా ఏర్పాటు చేసి నూతన కమిటీలను ప్రకటించారు. సంఘానికి సేవలందించిన పలువురిని శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు.