హైదరాబాద్ జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా అధికారులు, ఉద్యోగినులు పాల్గొని, వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించి ఆడారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పండుగ శోభను పెంచారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సాంప్రదాయ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.