బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు

6చూసినవారు
నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దేవి ఉత్సవాలు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. 7వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ రకాల పండ్లతో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతోందని భక్తులు తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్