పరీక్షల ఫలితాలు నిరాశపరిస్తే ఆత్మహత్యలు వద్దు: సీపీ సజ్జనార్

0చూసినవారు
పరీక్షల ఫలితాలు నిరాశపరిస్తే ఆత్మహత్యలు వద్దు: సీపీ సజ్జనార్
పదో తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత జరిగిన ఆత్మహత్యల ఘటనలు తనను తీవ్రంగా కలిచివేసాయన్నారు. మార్కులు తక్కువ వచ్చినా, విఫలమైనా ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, అది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుందని తెలిపారు. ఓటమి గెలుపుకు తొలిమెట్టని, జీవితానికి ముగింపు కాదని గుర్తుంచుకోవాలని కోరారు. పరీక్షల కంటే ప్రాణం గొప్పదని, ప్రతికూల ఫలితాలను ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్