హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో జరిగిన డాక్టర్ బి.వి. పట్టాభిరామ్ సంస్మరణ సభలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆధునిక మానసిక ప్రపంచంలో మానవ సంబంధాల బాగోగులను కౌన్సిలింగ్ ద్వారా మెరుగుపరచగల మేధావి పట్టాభిరామ్ అని ప్రశంసించారు. ఆయన జీవితం ఒక ఉత్సవంలా సాగిందని అన్నారు. పలువురు మానసిక నిపుణులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.