జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, మంత్రి సీతక్క ఆదివారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని తన నివాసంలో ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. 'నిండైన ఆరోగ్యవంతమైన జీవితానికి రెండు పోలియో చుక్కలు' అంటూ ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.