సనత్‌నగర్ డివిజన్‌లో పార్కులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి శనివారం అన్నారు. సనత్‌నగర్ బస్టాండ్ సమీపంలోని పార్కులో బోర్వెల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. బోర్వెల్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.