కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం సనత్ నగర్ అసెంబ్లీలోని బేగంపేట డివిజన్ భగవంత్ పూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన వసతుల కల్పనలో భాగంగా ఆయన పిల్లలకు బెంచీలు, టేబుల్స్, కిట్ సామాగ్రి, ఆట వస్తువులను అందించారు. ఈ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.