
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఫైనాన్స్ విభాగంలో ఎగ్జామీషనర్ ఆఫ్ అకౌంట్స్ అధికారి సంతోష్, రిటైర్ అయిన ఉద్యోగి పింఛను ప్రాసెస్ చేయడానికి రూ.35వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
































