
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చీడపురుగులు...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆఫ్రికన్ నత్తలు దర్శనమిచ్చాయి. ఈ చీడపురుగులు పెద్ద వృక్షాలను కూడా నేలకు ఒరిగేలా చేయగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి ఎక్కువగా కేరళలో కనిపిస్తాయని, వీటి జీవితకాలం, సంతానోత్పత్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వృద్ధి చెందుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. న్యూ బోయిన్పల్లిలోని ఏ1 మిలిటరీ స్థలంలో వీటిని చూసిన ప్రజలు కంటోన్మెంట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.




































