శనివారం, ఓల్డ్ బోయిన్పల్లిలోని మూతబడిన మేధా పాఠశాలలో ఈగల్ టీమ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 కిలోల అల్పాజోలం, రూ. 20 లక్షల నగదు, కల్లులో కలిపే పౌడర్ లభ్యమయ్యాయి. ఒక పాత భవనంలో అల్పాజోలం మత్తు మందు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ టీమ్ సోదాలు నిర్వహించి, అల్ఫాజోలం మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. మేధా హైస్కూల్ భవన యజమాని నారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ జయశంకర్ తో పాటు మరో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.