సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లి లో చేపట్టే 'లక్ష డప్పులు-వెయ్యి గొంతులు' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కోరారు. ఈనెల 7న చేపట్టే భారీ ర్యాలీకి సంబంధించి అస్మత్ పేట్ లోని బీసీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహం వద్ద గోడపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కర్రే జంగయ్య, మక్కల నర్సింగ్ రావు, బుర్ర యాదగిరి, గడ్డం నరసింహ, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.