హైదరాబాద్: అక్రమంగా రోడ్డుపై వేసిన షెడ్లను తొలగిస్తున్న ఏసీపీ బృందం

53చూసినవారు
హైదరాబాద్: అక్రమంగా రోడ్డుపై వేసిన షెడ్లను తొలగిస్తున్న ఏసీపీ బృందం
బోయినపల్లి-హస్మత్పెట్ రహదారిలో వెలసిన అక్రమ ఆవాసాలపై ట్రాఫిక్ పోలీసులు శనివారం చర్యలు తీసుకున్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు అక్రమంగా వెలిసిన పలు షెడ్లను తొలగించినట్టు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు తెలిపారు. ప్రధాన రహదారుల పక్కన ఎలాంటి ఆక్రమణలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బోయినపల్లి ప్రాంతంలో రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్