అడ్డగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులకు షూ, బెల్టు, టైలను శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. దాతలు శ్రీరామచంద్రరావు, ఎలమంచలి ఆకర్షణ, రాగిని మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ సూర్యప్రకాశ్ విద్యపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.