సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్లో అపస్మారక స్థితిలో కనిపించిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. జూన్ 26న అనారోగ్యంతో కనిపించిన సుమారు 50 ఏళ్ల వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, అతడి వివరాలు తెలిసినవారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని ఆదివారం పోలీసులు కోరారు.