బీజేపీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కంటోన్మెంట్ బోర్డు మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ అన్నారు. వస్తే బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం కంటోన్మెంట్ లోని 7వ వార్డు ఎస్బీహెచ్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన రామకృష్ణ పనులు ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నా లేకపోయినా బీజేపీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు.