స్కిల్ యూనివర్సిటీ పేరుతో టైపింగ్ నైపుణ్యాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర టైప్ రైటింగ్ సంస్థల చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్ హాండ్ కంప్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన, సీనియర్ టైపింగ్ గురువులను సన్మానించి, టైపింగ్ నైపుణ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.