బేగంపేటలో కర్ణాటక మంత్రితో రైతు కమిషన్ సమావేశం

బేగంపేట టూరిజం ప్లాజాలో కర్ణాటక మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి బోసు రాజుతో తెలంగాణ రైతు కమిషన్ సమావేశమైంది. రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యురాలు భవానీ రెడ్డి పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మైనర్, మేజర్ ఇరిగేషన్ అంశాలపై చర్చ జరిగింది. కోదండరెడ్డి మైనర్ ఇరిగేషన్ ప్రాముఖ్యతను వివరించారు. బోసు రాజు కమిషనన్ను కర్ణాటకకు ఆహ్వానించారు.
