సరైన జాగ్రత్తలు చేపట్టడం ద్వారానే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా నివారించవచ్చని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు. వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని కోరారు. బేగంపేట కార్పొరేటర్ టి. మహేశ్వరి, లీడ్ ఫైర్ ఆఫీసర్ రాజు పాల్గొన్నారు.