కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఎంఆర్ఎఫ్ పథకం లబ్దిదారులు 26 మందికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. పేదవారికి వైద్యం భారం కాకుండా చూసేందుకు, పేదవారికి కూడా కార్పోరేట్ స్థాయి వైద్యం లభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద అందిస్తున్న సిఎంఆర్ఎఫ్ అత్యంత వేగంగా లబ్దిదారులకు అందిస్తున్నామని అన్నారు.