సెల్పోన్ లో ఆటలు ఆడోద్దని, మైదానంలో ఆటలతోనే ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం లభిస్తాయని గురువారం తిరుమలగిరి ఇన్ స్పెక్టర్ నాగరాజు విద్యార్థులకు తెలిపారు. బడుల పునఃప్రారంభం సందర్భంగా తిరుమలగిరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్ పల్ ఉమారాణి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.