సికింద్రాబాద్: వృద్ధులకు దుప్పట్లు, మందులు పంపిణీ

59చూసినవారు
సికింద్రాబాద్: వృద్ధులకు దుప్పట్లు, మందులు పంపిణీ
దీక్షా దివస్ సందర్భంగా కార్ఖానలోని ఆర్కే ఫౌండేషన్ రాష్ట్ర బెవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గజ్జెల నాగేష్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు మందులు, దుప్పట్లు, ఆహారం శుక్రవారం అందజేశారు. మలి దశ ఉద్యమంలో 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు పదకొండు రోజుల పాటు కేసీఆర్ చేసిన అమరణ నిరాహార దీక్షకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందన్నారు.