కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్, 'నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట' కార్యక్రమంలో భాగంగా బుధవారం వార్డు 2 రసూల్ పురలోని అర్జున్ నగర్, బీరప్ప దేవాలయం, మార్కండేయ టెంపుల్ ఏరియాలలో పర్యటించారు. బస్తీ వాసుల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.