బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ విచారణ ముగిసింది. దీంతో మరోసారి విచారణకు రావాలని మంగళవారం నోటీసులు ఇచ్చారు. ఈనెల 18న రావాలని నోటీసులలో తెలిపారు. మొబైల్ సబ్మిట్ చేయకపోవటంతో 18న 10 గంటలకు మొబైల్ ను తీసుకురావాలని పోలీసులు సూచించారు. హెచ్సీయూ వివాదంలో ఏఐను వాడి సోషల్ మీడియాలో తప్పుడు ఫోటోలు పోస్ట్ చేశారని క్రిశాంక్ పై ఆరోపణలు ఉన్నాయి.