సంక్రాంతి పండగ సందర్భంగా కంటోన్మెంట్ మొండా డివిజన్ లోని వివిధ బస్తీలలో కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు వివిధ రంగులతో ముగ్గులు వేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేశారు. సంతోష్ యాదవ్ మాట్లాడుతూ, డివిజన్ లో రెండు రోజుల ముందే సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకున్నామని తెలిపారు.