సికింద్రాబాద్ సమీపంలో బీబీనగర్–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం తెల్లవారుజామున కిలోమీటర్ నం. 221/29–30 వద్ద 12722 దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి వచ్చిన సుమారు 195 గొర్రెలను ఢీకొనడంతో అవి మృతి చెందాయి. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం అల్లీనగర్‌కు చెందిన బాలమోని కిష్టయ్య (70)కు చెందిన ఈ గొర్రెలు, కుక్కలు తరమడంతో భయపడి రైల్వే ట్రాక్‌పైకి వచ్చి ఉండవచ్చని ఆయన తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.