స్నేహితుడినే హత్య చేసి కాల్చేసిన యువకుడు

1చూసినవారు
స్నేహితుడినే హత్య చేసి కాల్చేసిన యువకుడు
సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో ర్యాపిడో రైడర్ పొన్నకంటి కాశి, తన స్నేహితుడు పొన్నకంటి శేఖర్‌ను మద్యం తాగించి, హత్య చేసి, మృతదేహాన్ని పెట్రోల్‌తో కాల్చేసిన ఘటన కలకలం రేపింది. గతంలో ఇద్దరూ కలిసి ఒక దుకాణం నుండి రాగి తీగను దొంగిలించారు. ఈ విషయం బయటపడటంతో అవమానంగా భావించిన కాశి, శేఖర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 30న మద్యం మత్తులో ఉన్న శేఖర్‌ను గొంతు నులిమి హత్య చేసి, పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడైన కాశిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్