లాలాపేట్–మౌలాలి రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన ఎన్న లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. జవహర్నగర్కు చెత్త లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న రాపిడో బైక్ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెనుక కూర్చున్న భువనగిరికి చెందిన పాల్ తీవ్రంగా గాయపడి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.