రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి.

0చూసినవారు
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి.
సికింద్రాబాద్ మరియు లాలాగూడ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున ఒక గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. మృతుడు సుమారు 55-60 ఏళ్ల వయస్సు గలవాడిగా భావిస్తున్నారు. రైల్వే పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో గుర్తుతెలియని రైలు అతని తలపై నుంచి వెళ్లి ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. అతని తల పూర్తిగా ఛిద్రమైంది. ఎడమ చేతిపై 'పోచమ్మ' అనే పచ్చబొట్టు ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్