గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం స్వాధీనం

1చూసినవారు
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం స్వాధీనం
సికింద్రాబాద్ బసీరా హోటల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వృద్ధుడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎలాంటి గుర్తింపు వివరాలు లభించకపోవడంతో, మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్