సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా ఆదివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వస్తున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ముఖద్వారంలో ఎదురుపడ్డారు. ఇద్దరు సంతోషంగా ఆలింగనం చేసుకుంటూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.