వర్షాకాలంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, నగరంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు కమిషనర్ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌కు చెందిన సిబ్బందితో సమీక్షించి మార్గదర్శకాలు జారీ చేశారు. జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌లు, యూ-టర్న్‌లను అడ్డుకునే వాహనాలపై, రాంగ్ రూట్‌లో వెళ్లేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.