మారేడ్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాంను సోమవారం కోరారు. నవరాత్రుల సందర్భంగా లబ్ధిదారులకు పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చినట్లు దీపిక తెలిపారు. ఈ సంఘటన హైదరాబాద్, సికింద్రాబాద్లో జరిగింది.