ఉప్పుగూడలో డ్రైనేజీ పనులు: వాహనాలకు, ప్రజలకు ఇక్కట్లు

48చూసినవారు
ఉప్పుగూడలో డ్రైనేజీ పనులు: వాహనాలకు, ప్రజలకు ఇక్కట్లు
ఉప్పుగూడ పరిధిలోని శివాజీ నగర్ లో, మంగళవారం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హనుమాన్ ఆలయం మరియు మీ సేవ వీధిలో డ్రైనేజీ పనులు చేపట్టింది. పాత పైపులను తొలగించి కొత్తవి వేయడం, మ్యాన్ హోల్స్ పునర్నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల వల్ల గుంతల్లో మురికి నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్